కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వాసుదేవ్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి సహకరంతో రూ. 48వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.