షాద్‌నగర్, అక్టోబర్ 5 : హోటల్లో పన్నీర్ బిర్యానీ తిందామని వెళ్తే.. చికెన్ ముక్కలు వచ్చాయి. ఈ విషయమై హోటల్ నిర్వాహకులను అడిగితే..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు వినియోగదారుడిపై దుర్భాషలాడారు. ఈ ఘటన షాద్‌నగర్ పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని జడ్చర్ల రోడ్డులో ఉన్న డైమండ్ బావర్చి హోటల్‌కు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లి.. పన్నీరు బిర్యానీని ఆర్డర్ ఇచ్చాడు.
కొంత బిర్యానీ తిన్న తర్వాత చికెన్ ముక్కలు నోటికి తగిలాయి. స్వతహాగా శాఖహారి అయిన అతడు.. ఈ విషయంపై హోటల్ నిర్వాహకులను అడుగగా.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దబాయించారు. దీంతో బాధితుడు.. సదరు హోటల్‌పై చర్య లు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరాడు.