సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాలయం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 25 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ లోగోను ఎంతో వినూత్నంగా రూపొందించి ఆవిష్కరించారు. ఊడల మర్రి చెట్టు.. 25 అంకెకు చెట్టు కొమ్మలు, కింద ట్రిపుల్ ఐటీ హైదరాబాద్.. అని ఆకట్టుకునేలా లోగోను రూపొందించారు.