కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్, ఎరగోవింద్తండా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులతో పాటు స్వచ్ఛభారత్‌లో నిర్వహించిన మరుగుదొడ్ల నిర్మాణాలను వాటిని వాడుతున్న తీరును కేంద్రబృందం సభ్యులు పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021లో భాగంగా కులకచర్ల మండల ఎంపీడీవో సిబ్బందితో కలిసి తిర్మలాపూర్, ఎరగోవింద్తండా గ్రామ పంచాయతీల్లో వివిధ అంశాలను పరిశీలించారు. గ్రామంలో స్వచ్ఛభారత్ అమలు చేసిన తీరును వారు పరిశీలించారు. ముఖ్యంగా మరుగుదొడ్ల పనితీరును పరిశీలించారు. నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించి వాటి వాడకం గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీటి కాల్వల పరిశుభ్రత, గ్రామంలో పరిసరాల పరిశుభ్రత వంటి వివిధ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మండల అధికారులకు, సిబ్బందికి వివిధ సూచనలు చేశారు. కార్యక్రమంలో కేంద్రబృందం సభ్యుడు సాయిబాబు, స్వచ్ఛభారత్ జిల్లా కో-ఆర్డినేటర్ రవికిరణ్, లక్ష్మి, ఎంపీడీవో నాగవేణి, ఈవోఆర్డీ సుందర్, డీపీఎం వీరయ్య, రామ్మూర్తి, ఏపీఎం శోభ, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సెర్ప్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.