ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, త్యాగం యేసు క్రీస్తు జీవితం అందరికి భోదపడేలా చేసిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. శనివారం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వేరు వేరుగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆమనగల్లు క్రైస్తవులతో కలిసి వేడుకల్లో పాల్గొనగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాడ్గుల మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎంబీ ఫిలదెల్ఫియా చర్చి ఫాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్ని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరపున సోదరులకు గిప్ట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీసెస్ చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. అంతకుముందు వేడుకలను పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను అందరిని అలరించాయి. ఆమనగల్లు పట్టణంతో పాటు ఆకు తోటపల్లి గ్రామంలో వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్సై ధర్మేశ్, వస్పుల జంగయ్య, నాయకులు పురషోత్తం పాల్గొన్నారు.