46 స్కూల్ బస్సులపై కేసు నమోదు
విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
రంగారెడ్డి, జూన్ 12(నమస్తే తెలంగాణ) : విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిఫ్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఫిట్నెస్లేని, పన్నులు చెల్లించని 46 బస్సులపై కేసు నమోదు చేశామన్నారు. ఫిట్నెస్లేని 15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పరాదన్నారు. అనుభవం గల, 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. తనిఖీలను కొనసాగిస్తామని, ప్రతి విద్యాసంస్థ బస్సుకు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. తనిఖీల్లో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణాశాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణ వేణి, సునీత, నవీన్, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

