యాచారం, డిసెంబర్ 7 : కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఖాజూమహ్మద్ మండిపడ్డారు. శనివారం గురుకులాల బాటలో భాగంగా మం డలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహాన్ని బీఆర్ఎ స్వీ, బీఆర్ఎస్వై నాయకులు సందర్శించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకుంటుంటే ఉపాధ్యాయులు వచ్చి విద్యార్థులను బెదిరించడాన్ని తప్పుబట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు తెలుసుకు నేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం తగదన్నారు. కేసీఆర్ పదేండ్లలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తే.. కాంగ్రెస్ ఏడాదిలోనే దానికి పాతరేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. యాచారం గురుకులంలో కనీస వసతుల్లేవని.. బిల్డింగ్కు కిటికీలు లేక విద్యార్థులు చలికి వణుకుతున్నారన్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గాలేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వసతిగృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.