KTR | కడ్తాల్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో కొలువైయున్న మైసమ్మతల్లిని మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింగ్ కేటీఆర్ దర్శించుకున్నారు. ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో మైసమ్మతల్లి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేటీఆర్‌ను శాలువాతో సన్మానించి అమ్మ వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, కల్వకుర్తి, అచ్చంపేట్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బాలరాజు, లక్ష్మారెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌లు తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, హరిచంద్‌నాయక్, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు ఉన్నారు.