చేవెళ్ల రూరల్, జూలై 14 : తెలంగాణకు బీఆర్ఎస్ పార్టే శ్రీరా మరక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోనె మాధవరెడ్డి 100 మంది తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనె కరుణార్రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు, రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని.. ఎటు చూసినా అభివృద్ధి, సంక్షేమంతో కళకళలాడిందన్నారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మొత్తం దివాలా తీసిందని ఆరోపించారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఎగిరేది గులాబీ జెండానే అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రజలకు చేసిందేమీ లేదని, గ్రా మాల్లో పంట రుణాలు ఇంకా మాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
కేసీఆర్ హయాం లో అటు చినుకులు పడితే ఇటు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు పడేవని గుర్తు చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన భగీరథ పథకంతో నేడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదన్నారు. 24 గంటల విద్యుత్తు, రోడ్లు, గురుకులాలు, పాఠశాలల భవనాలు, సమీకృత కలెక్టర్ భవనాలను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యులతో సహా జడ్పీ చైర్మన్ల వరకు గులాబీ జెండాలు ఎగురేలా ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో గోనె మాధవరెడ్డి, గోనె గోవర్ధన్‌రెడ్డి, గోనె సాయికిరణ్‌రెడ్డి, రమేశ్, రాజు, సురేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవి, కృష్ణ, మహేశ్, మల్లేశ్, లక్ష్మయ్య, బాలయ్య, సుధాకర్, సురేశ్, నందు, రజనీకాంత్, మహేశ్, కరుణాకర్, కల్యాణ్, ఉదయ్, శ్రీరాం, దయాకర్, ప్రదీ ప్, రాము, ధన్‌రాజ్, సన్నీ, విజయ్, తేజ, పవన్‌కుమార్, రాములు, ఆంజనేయులు తదితరులున్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిపాల్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు శేరి రాజు, ఆరిఫ్ మియా, రాహుల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, కార్తీక్, శ్రీకాంత్, నందు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.