రంగారెడ్డి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశంకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం బీ-ఫామ్‌లు అందజేశారు.
కాసాని వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి ఉండగా.. మల్లేశం వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.