MLA Marri Rajashekar Reddy | మల్కాజ్గిరి, మే 3 : రైల్వే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మల్కాజ్‌గిరిలోని దయానంద్ నగర్ రైల్వే స్టేషన్ విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మచ్చ బొల్లారం డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్ వద్ద ఆర్ యు బి నిర్మాణం కోసం రైల్వే అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్గిరి ఆర్కే నగర్లో నూతనంగా నిర్మిస్తున్న దయానందనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఆర్కే నగర్లో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్‌కు ఆర్కే నగర్ రైల్వే స్టేషన్‌గా నామకరణం చేయాలన్నారు. రైల్వే స్టేషన్ నుండి ఆర్కే నగర్ స్ట్రీట్ నెంబర్ 1,2 నుండి బయటకు వెళ్లేందుకు ఒకే మార్గాన్ని ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడతారని తెలిపారు. బయటకు (ఎగ్జిట్), లోపలికి వెళ్లడానికి మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్కే నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో గల విద్యుత్ లైన్లు అడ్డుగా ఉండడంతో రైల్వే అధికారులు ఎమ్మెల్యేకు తెలపడంతో విద్యుత్ అధికారులతో మాట్లాడి పరిష్కరింపజేస్తానని తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్‌కు ఆర్కే నగర్‌గా పేరు మార్చేందుకు, రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్లే మార్గాలకు రెండు గేట్లు పెట్టేందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు.
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ శ్రేణి సాధించిన నేషనల్ హైస్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందించా రు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏడిఆర్ఎం రెహమాన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిరుద్ పవర్, శశాంక్ నామ్‌దేవ్, అరుణ్ శర్మ, కమర్షియల్ ఇన్స్పెక్టర్లు సురేష్ ,పవన్, నాగలింగబాబు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాము యాదవ్, చిన్న యాదవ్, హేమంత్ పటేల్ , గోపాల్ సింగ్, బంటి, సతీష్, రాజశేఖర్, ఆర్కే నగర్ కాలనీవాసులు సోమశేఖర్, రాఘవేంద్ర, కెవివిఎస్ఎస్ గుప్తా, రవికిరణ్, సాయినాథ్, శివకుమార్, శ్యామ్ సుందరర్ తదితరులు పాల్గొన్నారు.