కేశంపేట : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సరికొండ యాదయ్య (48) మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సరికొండ యాదయ్య మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సోమవారం వేముల్నర్వకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతోపాటు గ్రామంలో బీఆర్ఎస్ పటిష్ఠత కోసంపాటు పడ్డాడన్నారు. యాదయ్య మృతి పార్టీకి తీరనిలోటని, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పర్వత్రెడ్డి, జగత్రెడ్డి, కె.యాదయ్య, చిర్ర చంద్రయ్య, డి.నర్సింహా, కె రమేశ్, కె రాజు, భూపాల్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.