పరిగి, ఆగస్టు 21: పరిగి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేరు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సోమవారం పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే పరిగిలోని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి-గిరిజాదేవి దంపతులకు పార్టీ నాయకులు స్వీట్లు తినిపించారు. అలాగే పార్టీ నాయకులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఐదేళ్లుగా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేశారన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. పరిగిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి మరోసారి ఘన విజయం సాధించడంతోపాటు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, సయ్యద్‌పల్లి సర్పంచ్ వెంకట్రాంక్రిష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్. భాస్కర్, సీనియర్ నాయకులు పి.వెంకటయ్య, బి.రవికుమార్, మౌలానా, అబ్దుల్ బషీర్, ఆకారపు రాజు, ఆసిఫ్, మంజుల, లక్ష్మీ పాల్గొన్నారు.
మహేశ్‌రెడ్డిని గెలిపించుకుంటాం
తెలంగాణ ఉద్యమకారులందరం కలిసి పరిగిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలంగాణ ఉద్యమకారుడు మల్లేపల్లి నర్సింహులు తెలిపారు. మహేశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. గత పర్యా యం వలె ఈసారి సైతం తెలంగాణ ఉద్యమకారులందరం సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్యేగా మహేశ్‌రెడ్డిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహేశ్‌రెడ్డిని ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నేడు మన్నెగూడ నుంచి ర్యాలీ
పరిగి, ఆగస్టు 21: పరిగి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కొప్పుల మహేశ్‌రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ప్రకటిం చడంతో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూడూరు మండ లం మన్నెగూడ నుంచి పరిగి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మంగళ వారం ఉదయం 8.30 గంటలకు మన్నెగూడలో ర్యాలీ ప్రారంభ మవుతుందని, కార్ల ర్యాలీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు పాల్గొనాలని పార్టీ నాయకులు కోరారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, ఆగస్టు 21: ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరు బీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను సోమవారం ప్రగతి భవనంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రకటించడంతో తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణం, పల్లెల్లోని వాడవాడల్లో బీఆర్ఎస్ నేతలు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. బ్యైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై రోహిత్‌రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తాండూరు అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులను తాండూరుకు తీసుకువచ్చి అన్నిరంగాల్లో తాండూరును శరవేగంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడంతో ప్రజల ఆనందాలకు అవధులు లేవు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్ మాట్లాడుతూ తాండూరును అభివృద్ధి చేస్తున్న యువ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తించి టికెట్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ రోహిత్‌రెడ్డి సేవలను గుర్తించి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం సంతోషమన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఉంటు తాం డూరులో బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రానివ్వమన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదంతో ముందుకు సాగుతూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో రోహిత్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో నేతలు విఠల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నయీంతో పాటు బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, నేతలు, యువకులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలంలో..
పెద్దేముల్, ఆగస్టు21 : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొంటూ రోహిత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టి ఓటర్లను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పి మాయచేస్తారని అలాంటి నాయకులను నమ్మరాదన్నారు.కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రవినాయక్, మట్టశ్రీను, డీలర్ అంజయ్య,రంగయ్య, సీహెచ్.రాములు, డీవై ప్రసాద్, మామిళ్ల వెం కట్, బంగ్ల రఘు, మాధవరెడ్డి, వెంకట్రామ్రెడ్డి, కిరణ్,నర్సింహులు,సత్తార్‌ఖాన్,చాకలిశేఖర్, నరేష్, ప్రేమ్, జమీర్, రాములు, రాములు, నర్సింహు లు, రాములు,రత్నప్ప,విష్ణు,శ్రీనివాస్‌గౌడ్,నర్సింహులు గౌడ్, రమేశ్ గౌడ్, మహేష్ గౌడ్,సర్పంచులు రాములు, గోవర్ధన్, సురేశ్, ఈశ్వర్, రాజు, శ్రీనివాస్, మహబూబ్, గేల్, నాగప్ప, నర్సింహ, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇదిలా వుండగాఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని హైదరాబాద్‌లో పెద్దేముల్ సొసైటీ చైర్మెన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి,మారేపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము గోపాల్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్యేను కలిసి వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు,శ్రీనివాస్ చారి, తదితరులు ఉన్నారు.
కులకచర్లలో…
కులకచర్ల, ఆగస్టు 21 : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి రెండవ సారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ తమ నాయ కుని పనితీరును గుర్తించి రెండవ సారి టికేట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో రెండవ సారీ ఎమ్మెల్యేగా గెలిపించుకుం టా మన్నారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.