కడ్తాల్, జూలై 19 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రావిచేడ్, న్యామతాపూర్, పుల్లేర్బోడ్ తండాలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన సిరి సాలమ్మ, జాల లక్ష్మయ్య, జటోవత్ దేవుజా కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరుపున మృతుల కుటుంబాలకు ఐదు వేల చొప్పున రూ.15 వేలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్తోపాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను విస్తృత పరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గోపాల్, ప్రియరమేశ్నాయక్, వసంతనాయక్, మాజీ సర్పంచ్ రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లాయక్అలీ, నాయకులు కృష్ణయ్య, రాములు, రమేశ్, మల్శే, రాజు, మోబీన్, ప్రశాంత్, రవి, వెంకటేశ్, జానకీరామ్, జాన్యా, శ్రీను, హరి తదితరులు పాల్గొన్నారు.