ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలు పార్టీల శ్రేణులు
ఇబ్రహీంపట్నం, జనవరి 16 : దేశంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల శ్రేణులు సోమవారం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో
ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్, నేడు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు జంగారెడ్డి, నాయకులు జానయ్యగౌడ్, రమేశ్, వెంకటేశ్, జంగయ్య, సదానంద్, జంగయ్య, నాగేశ్, రాజేశ్, కృష్ణ, మల్లేశ్, శ్రీకాంత్, అనిల్, సంపత్, కరుణాకర్