షాద్నగర్ : దేశ సరిహద్దులో ప్రాణాలకు తెలగించి పోరాడే సాయుధ దళాలకు అండగా ఉండవల్సిన సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ ( Y Anjaiah Yadav ) అన్నారు. శనివారం ఆయన జన్మదినం ( Birthday ) సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ పంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు దేశ సైనికుల అవసరాల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ( Blood donation) ప్రారంభించి మాట్లాడారు.
దేశ సరిహద్దులో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న వేల దేశ సాయుధ బలగాలకు మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితిలో రక్తం చాల అవసరం ఉంటుందని, అందుకు యువత స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు బ్లడ్ బ్యాంక్, షాద్నగర్ సర్కారు దవాఖాన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో 147 మంది రక్త దానం చేయడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ కౌన్సిలర్ బచ్చలి నర్సింహ్మా, బీఆర్ఎస్ నాయకుడు భీమారం వీరేశం, మున్సిపల్ 7వ వార్డు అధ్యక్షుడు కల్పగురి వెంకటేష్గుప్తా, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు లంకాల రాఘవేందర్రెడ్డిల ఆధ్వర్యంలో అంజయ్యయాదవ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వృద్ధులకు, అనాధాలకు అన్నదానం చేశారు. చీరలను పంపిణీ చేశారు.
అంజయ్యయాదవ్కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, కవిత
షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ( KTR) ప్రత్యేకంగా ఫోన్ చేసి అంజయ్యయాదవ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు యోగ ,క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత ప్రజాసేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాధించాలని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్, కల్వకుంట్ల కవిత ( Kavitha) స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపడం పట్ల అంజయ్యయాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.