రక్తదానం మహదానం
రక్తదానం మహాదానమని రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి హర్ట్ఫౌండేషన్, తలసేమియా సిక్కిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభిం చి మాట్లాడారు. రక్తదానం మహాదానమని..దానితో ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చన్నారు.
- రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి
- మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్వరంలో రక్తదానశిబిరం
మహేశ్వరం, జూలై 24: రక్తదానం మహాదానమని రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి హర్ట్ఫౌండేషన్, తలసేమియా సిక్కిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభిం చి మాట్లాడారు. రక్తదానం మహాదానమని..దానితో ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చన్నారు. మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలతో ఐటీ రంగంలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, దేశ, విదేశాల నుంచి కంపెనీలను తీసుకొస్తున్నారన్నారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, నియోజకవ ర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, నాయకులు చంద్రయ్య , శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, కృష్ణ పర్వతాలు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ బుక్‌ల పంపిణీ
తుర్కయాంజాల్, జూలై 24: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత అందిస్తే ఉత్తమ ఫలితాలను సాధిస్తారని బీఆర్ఎస్ పార్టీ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు కొత్తకుర్మ కార్త్తిక్ అన్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మున్సిపాలిటీ పరిధి, కమ్మగూడ శ్రీశ్రీనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు దీటుగా రాణిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్యాణ్‌నాయక్, యాదిరెడ్డి, చిన్నయ్య, ప్రేమ్‌కుమార్, శంకర్, టీచర్లు పాల్గొన్నారు.
దివ్యాంగులకు బస్సు పాసుల పంపిణీ
కేశంపేట, జూలై 24 : జడ్పీటీసీ తాండ్ర విశాలాశ్రావణ్రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పాపిరెడ్డిగూడలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని 600 మంది దివ్యాంగులకు తన సొంత డబ్బు రూ.30 వేలు ఖర్చు చేసి ఆర్టీసీ బస్సు పాసులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేయించి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులు శ్రావణ్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సింహు లు, ఫకీరయ్యగౌడ్, లక్ష్మయ్య, యాదయ్య, చెన్న య్య, జనార్దన్‌గౌడ్, శ్రీను, జహంగీర్, భీమ య్య, రాజు, బాల్‌రాజ్, పలువురు దివ్యాంగులు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

