అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 12 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 49వ రోజు శనివారం రాత్రి బాటసింగారం గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ ఎర్రవెల్లి లతశ్రీ, గ్రామశాఖ అధ్యక్షుడు ధన్సాగర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం, బాటసింగారంలో మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి గడపగడపకూ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంచలంచెలుగా ప్రతి గ్రామానికి నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గ ప్రజలకు శివన్నగూడెం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. లాజిస్టిక్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే 22 మందికి ప్లాట్లు ఇచ్చామని, మిగిలిన వారికి త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రామంలో చేసిన అభివృద్ధిని వివరించారు.
ఆర్టీసీ, ఆర్అండ్బీ అధికారులతో చర్చించి గ్రామం మీదుగా బస్సులు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్ర య్య, డీసీసీబీ వైస్ చైర్మన్ సతయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కోట వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, ఉపసర్పంచ్ కంది భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు ఉమాకాంత్చారి, కృష్ణ, వరలక్ష్మి, సాయిలు, సుశీల, వాసవి, వెంకటేశ్ పాల్గొన్నారు.