రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాట సింగారంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టించింది. బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. పశువైద్య, పశు సంవర్థక శాఖ సిబ్బంది ఆ ఫామ్ వద్ద కోళ్లను చంపి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. ఆ కోళ్ల ఫామ్ సామర్థ్యం 36 వేల కోళ్లు కాగా, అందులో ఇప్పటికే వేలాది కోళ్లు మరణించాయి. మరో 17,521 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు బాటసింగారానికి కిలో మీటరు పరిధిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో కోళ్లను అధికారులు పూడ్చిపెట్టనున్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి, ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారు.