ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 23 : చెంచుల జీవనోపాధి కోసం మెరుగైన వసతుల కల్పనకు ప్ర ణాళిక సిద్ధం చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) పథకం ద్వారా ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో నివాసముంటున్న చెంచుల జీవన స్థితిగతుల పూర్తిస్థాయి వివరాలను అందజేయాలని సూచించారు. పీవీటీజీల కుటుంబాలు, ఆవాసాలు, రహదారులు, టెలివిజన్ కమ్యూనికేషన్లు, విద్యు త్, సురక్షిత గృహాలు తదితర ప్రాథమిక సౌకార్యలతో అనుసంధానించే ప్రణాళిక రూ పొందించాలన్నారు. చెంచులకు పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాల మెరుగైన లభ్యత సహా సుస్థిర జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామసభలు నిర్వహించి ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, తాగునీరు, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, నైపుణ్యం, సంస్కృతి కేంద్రం, వన్‌దన్ వికాస్ కేంద్రం అంశాలపై సమగ్ర సర్వే చేపట్టి ని వేదిక ఇవ్వాలన్నారు. పీఎంజేఏవై చెంచు ప్రజల ఆరోగ్య రక్తహీనత వ్యాధి నిర్మూలన, క్షయ నిర్మూలన వందశాతం రోగనిరోధక టీకాలు, పీఎం సు రక్షిత మాతృత్వ యోజన, పీఎం మాతృ వందన యోజన, పీఎం పోషణ్, పీఎం జన్‌ధన్ యోజన తదితరాలన్నీ సంతృప్తిస్థాయిలో అమలయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామేశ్వరీదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.