పెద్దేముల్, జూన్ 14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తున్నదని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటలక్ష్మి, రాధ, నఫీజ్ సుల్తానా, సంగీత, అంగన్వాడీ టీచర్ రేణుక పాల్గొన్నారు.
మర్పల్లి : మండలంలోని పంచలింగాల యూపీఎస్‌లో శుక్రవారం విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కేశవులు, సీఆర్పీ మల్లేశం, పాఠశాల చైర్పర్సన్ శ్యామలమ్మ, ఉపాధ్యాయురాలు శోభారాణి, షబానా, అంగన్వాడీ టీచర్లు నాగమణి, శోభారాణి విద్యార్థులు పాల్గొన్నారు.
పూడూరు : పాఠశాలల్లో చేరిన ప్రతి చిన్నారికి అక్షరాభ్యాసం చేస్తున్నట్లు ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు అంజిలయ్య, వెంకటేశం పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సోమన్గుర్తి ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ అయిన పిల్లలకు ఉచితంగా పలకలు, పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్, దుస్తులు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న, ఉపాధ్యాయులు సంగీత,ఆశోక్, నవీన్‌కుమార్, అంగన్వాడీ టీచర్ అరుణదేవి,ప్రభావతి, వీఏవో రమాదేవి తదితరులు ఉన్నారు.
కులకచర్ల : మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశివర్ధన్ విద్యార్థులకు సొంతడబ్బులతో నోటు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నక్క నర్సింహులు, చింతకాయల వెంకటయ్య, నర్సింహులు, నంచర్ల మొగులయ్య, బిచ్చపు సత్యయ్య, కమ్మరి రమేశ్, చింతకాయల నర్సింహులు, ఎర్రం శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకట్రాములు, శ్రీశైలం, హన్మంతు, బాబు, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల జంగయ్య పాల్గొన్నారు.