బషీరాబాద్ : యూత్ ఐకాన్ స్వామీ వివేకానంద అని ఎస్సై విద్యాచరణ్ రెడ్డి అన్నారు. బుధవారం బషీరాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులేనివాడు పేదవాడు కాదని జీవితంలో ఆశయం లేకుండా సమయాన్ని వృథా చేసుకునేవాడు పేదవాడని యువతకు మార్గనిర్దేశం చేసిన మహోన్నతుడు వివేకానంద అని అన్నారు.
యువతకు వివేకానంద రోల్మాడల్గా నిలుస్తున్నారన్నారు. వివేకానంద జయంతిని యూత్డేగా పాటిస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చే మహావక్తగా అందరి మన్నలను పొందాడన్నారు. ఎక్మయిలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి గ్రామ యువకులు నివాలులు అర్పించారు.