భక్తిశ్రద్ధలతో బక్రీద్
త్యాగానికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్ పండుగను గురువారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఈద్గాలు, మసీద్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయమే నూతన వస్ర్తాలు ధరించి అక్కడకు వెళ్లిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
త్యాగానికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్ పండుగను గురువారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఈద్గాలు, మసీద్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయమే నూతన వస్ర్తాలు ధరించి అక్కడకు వెళ్లిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలయ్బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.

రకరకాల టోపీలు ధరించిన పిల్లలు సందడి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత పెద్దలు ఖురాన్ బోధనలను, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. త్యాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలోని మానవులంతా సమానమనే విషయాన్ని సూచిస్తుందని మత పెద్దలు చెప్పారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

