అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉం చుకుని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వాతావరణ మార్పులపై అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్‌రెడ్డి, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
- రంగారెడ్డి కలెక్టర్ శశాంక
షాబాద్, మే 27 : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉం చుకుని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వాతావరణ మార్పులపై అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్‌రెడ్డి, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ సూచనలు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పారిశుధ్య పనులు, ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకో వడంతోపాటు ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే వెం టనే సరిచేసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించడంతోపాటు ఇండ్ల మధ్య వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమలవ్యాప్తిని అరికట్టేందుకు ఆయిల్‌బాల్స్ వేయించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. భారీ వర్షాలతో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలుగకుండా పునరుద్ధరణ పనులను చేపట్టాలని.. విద్యుదా ఘాతాలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదనీటి ప్రవాహానికి రహదారులు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందుగా గుర్తించి.. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కాల్వలు తదితర వాటి వివరాలను సేకరించి నివేదికను సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

