అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 31 : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 32 మంది యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు యువత ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్, నాయకులు కొత్త కిషన్‌గౌడ్, లెక్కల విఠల్‌రెడ్డి, పూజారి చక్రవర్తిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, వినయ్‌రెడ్డి, నసీరుద్దీన్, జీవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
దళితులకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు అందజేత
ఇబ్రహీంపట్నం : దళితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం తుర్కయాంజాల్, రాగన్నగూడ గ్రామాలకు చెందిన 52 కుటుంబాలకు మన్నెగూడ సర్వేనంబర్ 27లో ఇండ్ల స్థలాల కోసం 30 సర్టిఫికెట్లు, మునగనూరులోని సర్వేనంబర్ 120లో 63 కుటుంబాలకు 23 సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల నుంచి పీవోటీ కింద లాక్కున్న భూములకుగాను వారికి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేసినట్టు చెప్పారు. ఇండ్ల పట్టాలతో ప్రతి దళిత కుటుంబానికి నేరుగా రూ.కోటి విలువైన స్థలం లభించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, తాసిల్దార్ అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, కౌన్సిలర్లు వేముల స్వాతి, మేతరి అనురాధ, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు మోహన్‌గుప్తా, శ్రీనివాస్‌గౌడ్, దర్శన్‌కుమార్ పాల్గొన్నారు.
రైతు బీమాతో కుటుంబాలకు ధీమా
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 31 : అన్నధాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని, రైతు బీమాతో బాధిత కుటుంబాలకు ధీమా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని చిన్నరావిరాల గ్రామానికి చెందిన రైతులు అబ్బవతి పరమేశ్, నారెడ్డి అంజిరెడ్డి మృతి చెందారు. వారి కుటుంబానికి రైతుబీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున మంజూరైన రూ.10 లక్షల ఎల్వోసీలను శనివారం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుబీమా పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సర్పంచ్ వనజ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ అనిత, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగయ్య తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
అబ్దుల్లాపూర్‌మెట్ : ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన దంటపల్లి వీరారెడ్డికి రూ. 60వేలు, డొకని బుచ్చయ్యకు రూ. 18 వేలు, వల్లపు ఐలయ్యకు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దంతూరి అనిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, సర్పంచ్ వనజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, నాయకులు చక్రవర్తిగౌడ్, దానేష్, మహేందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గుండ్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.