అస్తమా(ఉబ్బసం) వ్యాధి దీర్ఘకాలం పాటు విడువకుండా వేధించే క్రానిక్ డీసిజ్. ఈ సమస్యతో ఊపిరితిత్తులోకి ప్రాణవాయువును తీసుకువెళ్లే శ్వాసకోశ నాళాలు, లోపాల గోడలు ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రత్యేకించి పెద్దవారి కంటే ఈ వ్యాధి వల్ల పిల్లల్లోనే ముప్పు ఎక్కువ. ఎందుకంటే వారి శ్వాసకోశ నాళాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అస్తమాతో చిన్నారులకు ఎక్కువగా ప్రాణాపాయం ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యంతో రెండు దశాబ్దాలుగా అస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. లేదంటే వ్యాధి తీవ్రత పెరిగి దీర్ఘకాలిక వ్యాధిగా సంక్రమించే అవకాశం ఉంది.
ప్రాథమిక స్థాయిలోనే అస్తమాను గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చు. వ్యాధి ముదిరితే దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది. గతంలో ఈ వ్యాధి నివారణ కోసం ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వాడేవారు. దీంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునేవి. చేతులు, కాళ్లు వణకడం, షుగర్, బీపీ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇటీవల కాలంలో పీల్చే మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులుగా వాడుతున్నారు.
పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ కాలుష్యంతో అస్తమా బాధితులు ఎక్కువవుతున్నారు. పరిశ్రమలు విస్తరించడం, వాహనాల కాలుష్యం మరో కారణం. నివాస గృహాలతో పాటు పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, ఇంట్లో వాడే దిండ్లు, పరుపుల్లో పేరుకున్న దుమ్ము వల్ల అస్తమా బారినపడే ప్రమాదముంది. తడి గోడల వల్ల డస్ట్ మైట్స్ సూక్ష్మ క్రిములు చేరి వ్యాధి కారకాలుగా మారే అవకాశముంది. మరోవైపు పెరుగుతున్న పరిశ్రమల వల్ల భవిష్యత్లో అస్తమా వ్యాధిగ్రస్తులు పెరిగే అవకాశముందని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు