బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 27, 2020 , 01:14:33

ముంపు ప్రాంతాల్లో ముప్పు లేకుండా చూడాలి

ముంపు ప్రాంతాల్లో ముప్పు లేకుండా చూడాలి

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ 

మాదాపూర్‌: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా గంగారం చెరువు చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం గంగారం చెరువు చుట్టు పక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మియాపూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలు, చెరువు చుట్టు పక్కల నివాసాలు ఏర్పరుచుకున్న స్థానికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు ఏసీపీ హరి, సంపత్‌, ఈఈ చిన్నారెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ శేషగిరిరావు ఉన్నారు.