Amanagal | ఆమనగల్లు, మార్చి 28: ఆమనగల్లు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది అండేకార్ యాదిలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది, ఎలక్షన్ అధికారి లక్ష్మణ శర్మ పర్యవేక్షణలో ఆమనగల్లు కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు సమావేశమై బార్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా అండేకార్ యాదిలాల్, ఉపాధ్యక్షునిగా ఏర్పుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా దుడ్డు ఆంజనేయులు యాదవ్, సంయుక్త కార్యదర్శిగా యం. విజయ్‌కుమార్, కోశాధికారిగా కొప్పు కృష్ణ, గ్రంథాలయ కార్యదర్శిగా వస్పుల మల్లేశ్‌లు ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఆమనగల్లు బార్ అసోసియేషన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు జానకీరాములు, కృష్ణయ్య, భాస్కర్‌రెడ్డి, వెంకట్ గౌడ్, సుధాకార్ రెడ్డి, మల్లేశ్ గౌడ్, న్యాయవాదులు మధు గౌడ్, గణేశ్ గౌడ్, సంతోశ్, మల్లేశ్, మురళీకృష్ణ, ఆంజనేయులు, దేవేందర్, శేఖర్, బీక్యానాయక్, శిరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.