శంషాబాద్ : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధి పనులు చేయడానికి దేవాదాయశాఖ నుంచి అనుమతి లభించింది. అందుకు సంబంధించిన ఆర్దర్ కాపీని సోమవారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్‌కు అందజేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నీరటి రాజుముదిరాజ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పురాతన దేవాలయం అమ్మపల్లి(సీతారామచంద్రస్వామి) ఆలయ రాజగోపురం మరమత్తులు చేయడానికి భక్తులు, ఇతర వ్యక్తుల నుంచి నిధులు సేకరించి పనులు చేయడానికి తాను ముందుకు రావడంతో దేవాదాయశాఖ అనుమతికోసం సంప్రదించగా వారి నుంచి ఇటీవల ఆర్డర్ కాపీ వచ్చిన్నట్లు తెలిపారు.
ఆ కాపీను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆలయఅధికారులు, ధర్మకర్తల ఆధ్వర్యంలో అందజేశామని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆలయ మరమత్తులు చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ధర్మకర్తలు చందన్‌వెళ్లి శ్రీనివాస్, నీరటి కృష్ణ, నీరటి అశోక్, లావణ్యవిశ్వనాథ్ ,పీఏసీఎస్ చైర్మన్ బురుకుంట సతీష్, డైరక్టర్ హిరేకార్శివాజీ, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నీరటి శేఖర్‌ముదిరాజ్, వార్డు సభ్యుడు టీ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.