రంగారెడ్డి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 134వ జయంతి వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముందు చూపుతో చేసిన రాజ్యాంగం వల్ల దేశంలో అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.
అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాన్నారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేశారని ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కమ్మగూడ వివేకానంద చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా మాజీ కౌన్సిలర్ కోశికె అయిలయ్య అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేస్తున్న డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు.
షాబాద్ మండలంలో..
మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం మండలంలోని షాబాద్, హైతాబాద్, నాగరగూడ, సర్దార్నగర్, తిమ్మారెడ్డిగూడ, చందనవెళ్లి, కుమ్మరిగూడ, బోడంపహాడ్, సంకెపల్లిగూడ తదితర గ్రామాల్లో నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లులర్పించారు.
అంబేద్కర్ జయంతి వేడుకలో మాట్లాడుతున్న యాదవ విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్యాదవ్.