సాగర తీరంలో, లుంబినీ పార్కు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపం పనులు శర వేగంగా కొనసాగతున్నాయి. బంగారం వర్ణపు పూతను స్తూపానికి వేయడంతో నగర వాసులను ఆకట్టుకుంటున్నది. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం సైతం బంగారం పూతతో దగదగా మెరుస్తున్నది. గార్డెనింగ్ పనులు, లోపల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. లుబినీ పార్కుకు వచ్చే సందర్శకులు అమర వీరుల స్మాకర స్తూపాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.