The Paradise | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ (THE PARADISE). దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.
ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్ AayaSher ఇంట్రో సాంగ్ రానుందని తెలిసిందే. ప్రస్తుతం నాని ఇంట్రడక్షన్ సాంగ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తుందట శ్రీకాంత్ ఓదెల టీం. అనిరుధ్ కంపోజిషన్‌లో వచ్చే ఈ పాటకు ఏకంగా 600 మంది డ్యాన్సర్లు స్టెప్పులేయబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న ఈ సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇంట్రో సాంగ్‌గా ఉండబోతుందట.
నాని బర్త్ డే సందర్భంగా శ్రీకాంత్ ఓదెల ట్రీట్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మాస్ బ్యాంగర్గా ఉండబోతున్న సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మొత్తానికి నాని ఈ సారి ఏదో గట్టి ప్లానే రెడీ చేసుకున్నాడని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్లో నటిస్తుండగా.. కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో రిపీట్ అవడం, మరోవైపు జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత నాని-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్