వికారాబాద్ : మోమిన్ పేట 1999 – 2000 పదవ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ( Alumni ) ఆత్మీయ సమ్మేళనం సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా 25 సంవత్సరాల ( Silver Jublee) అనంతరం ఒకచోట కలిసిన సందర్భం అనిర్వచనీయం. పాత మిత్రులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా పాతరోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి గురువులను( Teachers) ఘనంగా సత్కరించి , పాదాభివందనాలు చేశారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో తమ ముందుకు రావడం, సన్మానించడం శుభ పరిణామమని కొనియాడారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అంతకుముందు పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ గురువులు బోధించిన చదువులు, వారి ఆశీస్సుల కారణంగా తామంతా ఉన్నత స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నారన్ రెడ్డి, వెంకటయ్య, బక్కయ్య, మనోహర్, రిజ్వానా బేగం, జనార్ధన్, రుక్మయ్య, రమేష్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, మల్లేశం, పూర్వ విద్యార్థులు డి వెంకన్న, రవి, శ్రీనివాస్, ప్రభయ్య, శ్రీకాంత్, నాగయ్య, శివకుమార్, ప్రశాంత్, దేవకుమార్, కాంతారావు, శేఖర్, పసియుద్దిన్, కృష్ణ పాల్గొన్నారు.