షాద్‌నగర్ టౌన్ : రంగారెడ్డి ( Rangareddy ) జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్ల ( Veljerla ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ( Alumni Student ) ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2004-05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 40మంది విద్యార్థులు 20 ఏండ్ల తరువాత అదే పాఠశాలలో ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో మనోహర్, ఉపాధ్యాయులు జ్యోతి ప్రభాస్, సుశీల మాట్లాడుతూ తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను గుర్తించుకుని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదిగినప్పుడే తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.