కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు ప్రాధాన్యం
ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని.. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు.
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
- ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు
మొయినాబాద్, మే 18 : ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని.. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రా మానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సలీంఖాన్తోపాటు మరో100 మంది ఆ పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, మంజులారవియాదవ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో సబితారెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ హయాం లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చారన్నారని గుర్తు చేశారు. మైనారిటీ బాలికల కోసం దాదాపుగా 200 మైనారిటీ గురుకులాలు, ఇంటర్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. బండి భగీరథ్ కేసు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మున్సిపాలిటీల్లో పన్నులను పెంచేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
భూములపై సీఎం కన్ను పడింది..
రంగారెడ్డి జిల్లాలోని భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కన్నుపడిందని, రైతులు సాగు చేసుకుని జీవిస్తున్న భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలు కావడంతో ఆ రంగంపై ఆధారపడిన అనేక మంది రోడ్డునపడ్డారన్నారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క కంపెనీని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ర్టాన్ని దివాలా తీసి ప్రపంచ దేశాల ముందు పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, సీనియ ర్ నాయకుడు కొత్త నర్సింహారెడ్డి, మండలాధవెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రావూఫ్, దర్శన్, అంజయ్యగౌడ్, శ్యాంరావు, యాదయ్య, మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, పరమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

