Vikarabad | మర్పల్లి, జూన్ 22 : మండలంలోని బిల్కల్ గ్రామంలో గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తున్నట్లు ఆదివారం తీర్మానం చేశారు. గ్రామస్తులు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలో బెల్ట్ షాపులు నడుపరాదని పంచాయతీ కార్యదర్శి రాకేష్ సమక్షంలో తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.