మంచాల, ఫిబ్రవరి 6 : ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ నెల 9న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, యువజన విభాగం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనపర్తి బద్రీనాథ్గుప్తా అన్నారు. ఆదివారం మంచాల మండల కేంద్రంలోని దండేటికార్ ఫంక్షన్హాల్లో యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రధాన కార్యదర్శి గంట విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువజన విభాగం కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి బైకు ర్యాలీ నిర్వహించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, నాయకులు నూతనగంటి శేఖర్, ఎండీ జానీపాషా, మహేందర్, ప్రవీణ్ నాయక్, ప్రశాంత్‌కుమార్, చింతకింది వీరేశం, చంద్రకాంత్, దేవేందర్, శ్రీనివాస్, కొత్తపల్లి సాయి, అశోక్, ఖాజా, రాజేశ్, నిఖిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న ఉదయం 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వద్దకు భారీగా తరలిరావాలన్నారు.