కొండాపూర్ : కొండాపూర్ డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీలోని హైటెన్షన్ రోడ్డులో శుక్రవారం ఓ వ్యక్తి హైటెన్షన్ స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. దాంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు, అతను పోల్ ఎక్కడానికి గల కారణాలు తెలియరాలేదు.
వ్యక్తి పోల్ పైకి ఎక్కడంతో హైటెన్షన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పైనున్న వ్యక్తిని కిందకు దింపేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా పోల్ ఎక్కిన వ్యక్తి ఒంటిపై బట్టలు సరిగా లేకపోవడంతో అతడికి మతిస్థిమితం లేనట్టు అనుమానిస్తున్నారు. వ్యక్తి కిందకు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.