బాటసింగారానికి.. పండుగొచ్చింది
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.
- శివరాత్రి పండుగ నేపథ్యంలో కిటకిటలాడుతున్న పండ్ల మార్కెట్
- శుక్రవారం పది వేల టన్నులకు పైగా క్రయవిక్రయాలు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి. గడ్డిఅన్నారం పండ్లమార్కెట్ను అక్కడి నుంచి బాటసింగారానికి తరలించిన తర్వాత అధికారులు కొనుగోలు, అమ్మకందారుల కోసం అన్ని వసతులు కల్పించారు. దీంతో నగరంతోపాటు వివిధ ప్రాం తాలు, ఇతర రాష్ర్టాల నుంచి పండ్లు పెద్ద ఎత్తున పండ్లు బాటసింగారం పండ్ల మార్కెట్కు చేరుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ద్రాక్ష, ఆపిల్, దానిమ్మ, పుచ్చకాయ, బత్తాయి, సపోట, బొప్పా య, జామ వంటి పండ్లు ఉన్నాయి. దీంతో గత మూడు, నాలుగు రోజులుగా ఈ మార్కెట్లో రికా ర్డు స్థాయిలో పండ్ల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. అందువల్ల వారి కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున బాటసింగారం మార్కెట్కు వచ్చి తమకు కావాల్సిన పండ్ల ను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మార్కెట్కు వచ్చే కొనుగోలు, అమ్మకందారులకు అధికారులు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇక్కడ రాత్రి సమయంలోనూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
రికార్డు స్థాయిలో అమ్మకాలు..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత మూడు, నాలుగు రోజులుగా బాటసింగారం పండ్లమార్కెట్లో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం 8,291 టన్నుల పండ్ల క్రయ,విక్రయాలు జరుగగా.. శుక్రవారం 10 వేల టన్నుల మేర జరిగాయి. శనివారం మహాశివరాత్రి రోజున 8,000 నుంచి 10,000 టన్నుల వరకు క్రయ,విక్రయాలు జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా క్రయ,విక్రయాలు ఊపందుకోవడంతో పండ్ల మార్కెట్ కొనుగోలు, అమ్మకందారులతో కిక్కిరిసిపోతున్నది. మార్కెట్ వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇదే రికార్డు స్థాయి అమ్మకాలని కార్యదర్శి నర్సింహారెడ్డి తెలిపారు.
నాణ్యమైన పండ్లను అందిస్తున్నాం
బాటసింగారం పండ్ల మా ర్కెట్లో నాణ్యమైన పండ్లను సరసమైన ధరలకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగో లు, అమ్మకందారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. తాగునీరు, లైటింగ్ సిస్టమ్, ధర్మకాంటాలను ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -నర్సింహారెడ్డి, పండ్లమార్కెట్ కార్యదర్శి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

