రంగారెడ్డి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం నమోదైంది.
గత ఎన్నికలతో పోలిస్తే.. 2 శాతానికి పైగా ఓటర్లు తగ్గారు. మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో గత ఎన్నికలు, ఈసారి ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈసారి స్వల్పంగా ఓటింగ్ పెరిగింది. పోలింగ్ శాతం అనుకున్నంతగా పెరగకపోవడంతో తగ్గిన పోలింగ్ సరళితో ఎవరికి నష్టం! అన్నదానిపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.