రంగారెడ్డి, సెప్టెంబరు 18(నమస్తే తెలంగాణ) :గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరా లు ఉంటే తెలపాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నా రు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 13న ప్రచురించడం జరిగిందని, దీనిపై అభ్యంతరాలు ఉం టే ఈ నెల 21 వరకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించడం జరుగుతుందని, ఇందులోనే తమ అభ్యంతరాలను అంద జే యవచ్చన్నారు. ఈ నెల 26న అభ్యంతరాలను డిస్పోజ్ చేసి 28న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో నివసించనివారి పేర్లు, వివాహం చేసుకుని వెళ్లినవారి పేర్లు, చనిపోయినవారి పేర్లను తొలగించాలని, ఒకే కుటుంబంలో ఉండే వారి పేర్లను ఒకే వార్డు లో ఉండేలా జాబితా తయారు చేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు కోరారని తెలిపారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, రాజకీయ పార్టీలు సూచించిన అంశాలను పరిగనలోకి తీసుకొని ఫైనల్ ఓ టర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్, దొండ రమణారెడ్డి, బీఆర్ఎస్ నుంచి నిట్టూ జగదీశ్, సీపీఎం నుంచి పగడాల యాదయ్య, సామేల్ పాల్గొనారు.
వికారాబాద్, సెప్టెంబర్ 18 : ఓటర్ల ముసాయిదా జాబితా తయారీ కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారం అందించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లింగ్యా నాయక్ కోరారు. బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్‌తో కలిసి ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ముసాయిదా జాబితాపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .. గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు. గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 13న ప్రచురించామని, ఓటర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 వర కు స్వీకరించడం జరుగుతుందన్నారు.
ముసాయిదా ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, అదే విధంగా ఏమైనా మా ర్పులు, చేర్పులు ఉంటే జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నెల 19న జరిగే మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో తమ అభ్యంతరాలు, సూచనలు అందజేయవచ్చని సూచించారు. ఈ నెల 26న అభ్యంతరాలు, సూచనలను పరిగనలోనికి తీసుకొని, 28న చివరి ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాల్లో నివసించని వారి పేర్లు, వివాహం చేసుకొని వెళ్లిన వారి పేర్లు, చనిపోయిన వారి పేర్లను తొలగించాలని పార్టీల ప్రతినిధులు కోరడం జరిగిందన్నారు. అందుకు అదనపు కలెక్టర్ జిల్లాలోని గ్రామ పం చాయతీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నా మని, మీరు సూచించిన అంశాలను పరిగనలోకి తీసుకొని తుది ఓటర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీపీఓ సంధ్యారాణి, వివిధ రాజకీయ ప్రతినిధులు మహిపాల్, ప్రసాద్, రాజేందర్ రెడ్డి, మల్లేశం, రాజేందర్ లు పాల్గొన్నారు.
కొడంగల్ : ఓటరుజాబితాలో మార్పులు, చేర్పులు ఉంటే.. వాటిని సవరించుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం తాసీల్దార్ కార్యాలయంలో ఆల్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించా రు. అలాగే.. మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో తాసీల్దార్ విజయ్‌కుమార్‌తోపాటు ఆయన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పట్టణంలోని వడ్డెరగల్లీలో పర్యటించి.. ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఆ వార్డు బీఎల్వో ఆనందమ్మను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పులు లేని ఓటరు జాబితాను ఏర్పాటుచేసే దిశగా బీఎల్వోలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు , అధికారులు పాల్గొన్నారు.