రామగిరి, మే 27: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో 20మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు సీవోఈ డా.జి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం జరిగిన 4వ సెమిస్టర్ పరీక్షలకు 5,090మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4,708మంది హాజరుకాగా 369మంది గైర్హాజరుకాగా 13 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు.
వీరిలో సూర్యాపేటలోని ఆర్కేఎల్కే డిగ్రీ కళాశాలలో 2, సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో 3, స్పందన డిగ్రీ కళాశాలలో 3, శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2, మోత్కూర్‌లోని సంతోష్ డిగ్రీ కళాశాలలో 1, మాల్లోని శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 1, భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో 1, ఆలేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో 1 డిబార్ అయ్యారు.
మధ్యాహ్నం జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 1,428మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1,255మంది హాజరుకాగా 166 గైర్హాజరుకాగా 7గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిలో రామన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2, నల్లగొండలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో 1, నీలగిరి డిగ్రీ కళాశాలలో 1, డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 1, భువనగిరిలోని స్టాన్‌ఫర్డ్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 1, భువనగిరిలోని నవభారత్ డిగ్రీ కళాశాలలో ఒకరు డిబార్ అయ్యారు.