గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jun 13, 2020 , 01:07:28

సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

మోమిన్‌పేట్‌: గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బాల్‌రెడ్డిగూడెంలో రూ.7 లక్షలతో, ఆమ్రాది కూర్ధు గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.  టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంగా మారిందన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ కల్యాణలక్ష్మి నిలిచిపోలేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బి.విజయ్‌కుమార్‌, ఎంపీపీ వసంత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నరసింహరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్ల్‌ అంజిరెడ్డి, ఎంపీడీవో శైలజారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.