బడంగ్‌పేటలో రూ.3.80 కోట్లతో నిర్మాణం
బడంగ్‌పేట, డిసెంబర్17: బడంగ్‌పేటలో రూ.3.80 కోట్లతో ప్రజా భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యి. పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు కొత్త భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించింది. మొదటి దశలో రూ.2.50 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆ నిధులు సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజా భవనం పనులు పూర్తి కావడానికి రూ.3.80కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. పనులు చివరి దశకు వచ్చిన్నట్లు అధికారులు చెప్తున్నారు.బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో ఉన్న పేద,మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా భవన నిర్మాణం చేపట్టారు. భవిష్యత్‌లో స్థలం కొరత ఏర్పడుతుందని ముందు చూపుతో ప్రజా భవనం నిర్మా ణం చేస్తున్నారు. రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజల కోసమే ప్రజా భవనం..
బడంగ్‌పేటలో ప్రజల కోసమే ప్రజా భవనం నిర్మాణం చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి నిర్మాణ పనులు తీసుకువెళ్లాం. ప్రజల కోసం మంచి పనులను చేయించాలని సూచించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో పేద ప్రజలు పెండ్లి చేయడానికి ఇబ్బంది పడుతారు. ఫంక్షన్ హల్స్‌లో డబ్బులు పెట్టి చేయలేరు. పేద ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం.
త్వరలో పనులు పూర్తి చేయిస్తాం..
బడంగ్‌పేటలో నిర్మిస్తున్న ప్రజా భవనం పనులు త్వరగా పూర్తి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవన నిర్మాణం కోసం మొదటిసారి కౌన్సిల్ సమావేశంలో రూ.2.50 కోట్లు కేటాయించాం. భవనం పూర్తి కావడానికి రూ3.80 కోట్లు అవుతుంది. రెండు నెలల్లో భవనం పనులు పూర్తవుతాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ఉంటుంది. పేద ప్రజల కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్స్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మాణం చేసి భవనం నిర్మాణం చేయడానికి దొహదపడుతున్నారు.