షాద్‌నగర్, ఫిబ్రవరి 28: షాద్‌నగర్‌లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో షాద్‌నగర్ పట్టణంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటో డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఓ బైకర్ రాంగ్ రూట్లో రావడంతో దానిని తప్పించబోయి ఆటో బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఆటోలో నందిగామ మండలంలోని వీర్లపల్లి, చర్లఅంతిరెడ్డిగూడా, అప్పారెడ్డిగూడ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్నారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.