చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 16: రంగారెడ్డి జిల్లా కందవాడ ప్రాథమిక పాఠశాల రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాన్ని అందుకోవడం జిల్లాకే గర్వకారణమని డీఈవో సుశీందర్రావు అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా డివిజనల్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఆయన సమీక్ష అనంతరం ఇటీవల రా ష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాలయ్ అవార్డును అందుకు న్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సతరించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతను అమలుపరిచి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర బోగం, ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంత రం ఎంఈవో మాట్లాడుతూ కందవాడ ప్రాథమిక పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారా న్ని అందుకోవడం సంతోషకరమని, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే అది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వెంకటేశ్, రాష్ట్ర సీఎంవో కృష్ణయ్య, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.