రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 19: మద్యం షాపులను దక్కించుకొనే అదృష్టవంతులు ఎవరో శనివారం లక్కీ డ్రాలో తేలనుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 234 మద్యం షాపులకు 8,239 దరఖాస్తులు రాగా.. వికారాబాద్ జిల్లా నుంచి 59 షాపులకు 837 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో శనివారం లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నా రు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో, వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో శనివారం ఉదయం 11 గంటలకు డ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలి. షాపులు ఎవరికి దక్కుతాయోనని దరఖాస్తుదారులు ఉత్సుకతతో ఉన్నారు.
ఆయా ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల వారీగా ఒక్కో మద్యం షాపునకు వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీసి ఎవరికి దక్కిందో అధికారులు తెలపనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 234 మద్యం షాపుల్లో ఎస్సీలకు-17, ఎస్టీలకు-2, గౌడ కులస్తులకు 34 షాపులను రిజర్వేషన్లలో భా గంగా కేటాయించనున్నారు. మణికొండలో ఓ మద్యం షాపునకు అత్యధిక దరఖాస్తులొచ్చా యి. జిల్లావ్యాప్తంగా 8,239 దరఖాస్తులు రా గా ప్రభుత్వానికి రూ.164.78 కోట్ల ఆదాయం వచ్చింది. సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో మొ త్తం 134 మద్యం షాపులుండగా 4102 దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా మీర్పేట్(4), మన్సూరాబాద్(14) మద్యం షాపులకు 55 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 100 మద్యం షాపులుండగా 4,137 దరఖాస్తులొచ్చాయి. వీటిలో అత్యధికంగా మణికొండలోని 63వ మద్యం షాపునకు 94 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా చేవెళ్లలోని ఓ దుకాణానికి 15 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధం గా వికారాబాద్ జిల్లా పరిధిలో 59 మద్యం షాపులకుగాను 837 దరఖాస్తులొచ్చాయి. దీం తో ప్రభుత్వానికి రూ.16.74కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా పరిధిలోని 5 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 59 మద్యం షాపులుండగా వీటిలో ఎస్సీలకు-9, ఎస్టీలకు-2, గౌడ్ కులస్తులకు-6 షాపులు రిజర్వు అయ్యాయి.
నేడు అంబేద్కర్ భవన్లో డ్రా
వికారాబాద్ జిల్లాలోని 59 మద్యం షాపులకు 837 దరఖాస్తులొచ్చాయి. శనివారం ఉద యం 11 గంటలకు వికారాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో కలెక్టర్ డ్రా తీస్తారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటల వరకు అంబేద్కర్ భవన్‌కు చేరుకోవాలి. లక్కీ డ్రాకు సం బంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
వరప్రసాద్,వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్