ఆమనగల్లు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన రాచమల్ల రంజిత్‌కుమార్ ఇటీవల పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీంతో బాధితుడు బైక్ చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు రంజిత్‌కుమార్ బైక్ దొంగలించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు.