ప్రగతి నివేదన యా్రత్రలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 7 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 44వ రోజు సోమవారం రాత్రి గండిచెరువు గ్రామానికి చేరుకున్నది. ఆయనకు బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఎంపీటీసీ సాయికుమార్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుంచి గండిచెరువు గ్రామం వరకు డబుల్ రోడ్డును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంజూరు చేశారని తెలిపారు.
సర్వే నం 255 భూ సమస్యను త్వరలోనే పరిష్కరించి పట్టాను అందజేస్తామని హామీనిచ్చారు. భూగర్భ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం కోసం రూ. 5లక్షలు, 50 వీధి దీపాల కోసం ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం కళాకారుల నృత్యాలు ఆట, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోట వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు, చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్ ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు దూసరి యాదయ్యగౌడ్, కోట లక్ష్మారెడ్డి, ఎర్రవెల్లి గౌరీశంకర్, ఉమాకాంత్చారి, ఏసూరి శేఖర్, మొగుళ్ల జీవన్‌రెడ్డి, పూజారి నవీన్‌గౌడ్, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.