బుధవారం 27 జనవరి 2021
Rajanna-siricilla - Dec 02, 2020 , 00:54:29

ఉపాధ్యాయుల సేవ ఆదర్శనీయం

ఉపాధ్యాయుల సేవ ఆదర్శనీయం

సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్‌:  ఉపాధ్యాయుల సామాజిక సేవ ఆదర్శనీయమని సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. మంగళవారం ప్రధాన దవాఖానలో టీపీటీఎఫ్‌  ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసమే కాకుండా సమాజ శ్రేయస్సుకు పాటుపడడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దోర్నాల భూపాల్‌రెడ్డి, కార్యదర్శి జీ వేణుగోపాల్‌రావు, టీపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పాతూరి మహేందర్‌ రెడ్డి, ఎం.లక్ష్మణ్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ మురళీధర్‌, బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జి రజని, మల్లారపు పురుషోత్తం, వాసుదేవరావు, రవీందర్‌, శ్రీధర్‌, శంకర్‌, మనోహర్‌, తదితరులు ఉన్నారు. 


logo